బోన్‌లెస్ చికెన్: ఒక కప్పు, మైదాపిండి: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు: ఒక టీస్పూన్, గుడ్లు: రెండు, కారం: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, మిరియాల పొడి: పావు టీస్పూన్, సోయాసాస్: ఒక టీస్పూన్, నూనె: సరిపడా.
ముందుగా చికెన్‌ను వీలైనంత చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్, మిరియాల పొడి, కారం, సోయాసాస్, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో మైదావేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లి కాస్త జారుగా కలుపు
కోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి వేడయ్యాక నూనెవేసి చికెన్ మిశ్రమాన్ని చిన్నచిన్న పాన్కేకుల్లా వేసుకుని రెండు వైపులా దోరగా కాల్చుకుంటే నోరూరించే చికెన్ పాన్‌కేక్స్ సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Vegetable pan cake | వెజిటబుల్ పాన్కేక్
potato pancake | పొటాటో పాన్కేక్
broccoli mushroom fry recipe | బ్రకోలి మష్రూమ్ ఫ్రై
రాగి హల్వా ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
korra ambali | రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొర్ర అంబలిని ఇలా చేసుకోండి
butter brocoli recipe | బ్రకోలితో ఇలా రుచిగా వండుకోండి..