Srisailam Project | ఉద్యోగం రాలేదన్న బెంగతో ఆగిన గుండె.. గుమ్మడంలో శ్రీశైలం నిర్వాసితుడి మృతి
Srisailam Project | దశాబ్దాల కిందట చేపట్టిన శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో సర్వస్వం కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు జీవో 98 ద్వారా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల్సి ఉన్నా.. అమలు కాలేదు. దీంతో ఉద్యోగాల కోసం పోరాటాలు చేస్తూ.. వయస్సు కూడా మీరిపోతుండటంతో ఆందోళనకు గురవుతూ పలువురు నిర్వాసితులు అసువులు బాస్తున్నారు.
Srisailam Project | పెబ్బేరు, మార్చి 2 : దశాబ్దాల కిందట చేపట్టిన శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో సర్వస్వం కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు జీవో 98 ద్వారా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల్సి ఉన్నా.. అమలు కాలేదు. దీంతో ఉద్యోగాల కోసం పోరాటాలు చేస్తూ.. వయస్సు కూడా మీరిపోతుండటంతో ఆందోళనకు గురవుతూ పలువురు నిర్వాసితులు అసువులు బాస్తున్నారు. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలో మరొకరు మృతిచెందారు. పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన దళిత పైగేరి కురుమన్న (55) శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుడిగా ఉద్యోగానికి అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్నా అవకాశం దక్కలేదు. జీవో 98తో ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉండగా.. నాటి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదు.
ఇందుకోసం ఆయన సహచర నిర్వాసితులతో కలిసి ఎన్నో ఆందోళనల్లో పాల్గొన్నాడు. నిరంతరం మంత్రులను, ఉన్నతాధికారులను కలిసి ఉద్యోగ సాధన కోసం తీవ్రంగా శ్రమించినా ఆయనకు ఉద్యోగం దక్కలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన ఆయన సోమవారం తెల్లవారుజామున ఇంట్లోనే అస్వస్థతకు గురవగా.. దవాఖానకు తరలించేలోగా కన్నుమూశాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు నిర్వాసితులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి తమకు ఉద్యోగాలు కల్పించాలని పలువురు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

