e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News chicken paratha recipe | చికెన్ ప‌రాఠా రెసిపీ

chicken paratha recipe | చికెన్ ప‌రాఠా రెసిపీ

కావలసిన పదార్థాలు

బోన్‌లెస్‌ చికెన్‌: 250 గ్రా., మైదా పిండి: ఒక కప్పు, గోధుమ పిండి: ఒక కప్పు, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్‌ స్పూన్లు, నెయ్యి: పావు కప్పు, కారం: ఒక టీస్పూన్‌, పెరుగు: పావు కప్పు, పసుపు: పావు టీస్పూన్‌, మిరియాల పొడి: అర టీస్పూన్‌, నిమ్మరసం: ఒక టీస్పూన్‌, ధనియాల పొడి: ఒక టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్ట్‌: ఒక టీస్పూన్‌, గరం మసాలా: అర టీస్పూన్‌, కొత్తిమీర, పుదీనా తురుము: రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి.

- Advertisement -

చికెన్‌ పరోటా తయారీ విధానం

ఒక గిన్నెలో చిన్నగా కట్‌ చేసిన చికెన్‌ ముక్కల్ని వేసి బాగా కడిగి నీళ్లు వంపుకోవాలి. అందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, నిమ్మరసం, పెరుగు, ఒక టేబుల్‌ స్పూన్‌ నూనె, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి గంటపాటు నానబెట్టాలి. ఒక గిన్నెలో మైదా, గోధుమ పిండి, ఉప్పు, కొద్దిగా నూనె, నెయ్యి వేసి కొద్దికొద్దిగా నీళ్లుపోస్తూ చపాతీ పిండిలా ఒత్తుకుని పైనుంచి కాస్త నెయ్యిరాసి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద పాన్‌పెట్టి వేడయ్యాక ఒక టేబుల్‌ స్పూన్‌ నూనెవేసి ముందుగా నానబెట్టుకున్న చికెన్‌ వేసి, సన్నటి మంటపై మూత పెట్టకుండా పావుగంటపాటు ఉడికించుకోవాలి. చికెన్‌ బాగా ఉడికిన తర్వాత తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా తురుము వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి. ఇప్పుడు, పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని పూరీలా ఒత్తుకుని మధ్యలో చికెన్‌ మిశ్రమం పెట్టి చివర్లు ముడిచి మళ్లీ ఒత్తుకోవాలి. స్టవ్‌మీద పెనం పెట్టి పరోటాలను నెయ్యివేస్తూ రెండువైపులా కాల్చుకుంటే చికెన్‌ పరోటా సిద్ధం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

ఆకాశ‌న్నంటిన ట‌మాటా ధ‌ర‌లు.. ట‌మాట బ‌దులు కూర‌ల్లో వీటిని ట్రై చేయండి

recipe of chicken pancake | రుచికర‌మైన చికెన్ పాన్‌కేక్ ఇలా ఇంట్లోనే త‌యారు చేసుకోండి

broccoli mushroom fry recipe | బ్రకోలి మష్రూమ్‌ ఫ్రై

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement