సజ్జలు: ఒక కప్పు, సేమ్యా: అరకప్పు, బెల్లం: ఒక కప్పు, పాలు: నాలుగు కప్పులు, డ్రై ఫ్రూట్స్: పావుకప్పు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి: పావు టీస్పూన్.
సజ్జలను రెండు నిమిషాలపాటు సన్నని మంటపై వేయించి బాగా కడిగి గంటసేపు నానబెట్టాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నెయ్యి వేడయ్యాక బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. సేమ్యా కూడా వేయించి పెట్టుకోవాలి. అదే కడాయిలో పాలుపోసి బాగా మరుగుతున్న దశలో.. నానబెట్టిన సజ్జలు జోడించి పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత సేమ్యా, తరిగిన బెల్లం వేసి కలుపుతూ మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరిగా యాలకులపొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొంటే సజ్జల పాయసం సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Avocado Pasta Recipe l అవకాడో పాస్తా తయారీ విధానం
ragi puttu recipe | రాగిపుట్టు ఇలా తయారు చేసుకోండి
broccoli kofta recipe | వెరైటీ టేస్ట్ కావాలా? బ్రకోలితో ఇలా ట్రై చేయండి
ఆకాశన్నంటిన టమాటా ధరలు.. టమాట బదులు కూరల్లో వీటిని ట్రై చేయండి
recipe of chicken pancake | రుచికరమైన చికెన్ పాన్కేక్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి
broccoli mushroom fry recipe | బ్రకోలి మష్రూమ్ ఫ్రై
chicken paratha recipe | చికెన్ పరాఠా రెసిపీ