కావలసిన పదార్థాలు: పాస్తా: ఒక కప్పు, అవకాడో: రెండు, పాలకూర తురుము: అర కప్పు, కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: తగినంత, ఆలివ్ ఆయిల్: రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం: రెండు టీస్పూన్లు, మిరియాల పొడి: అర టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, చిల్లీ ఫ్లేక్స్: కొద్దిగా
తయారీ విధానం: కొద్దిగా ఉప్పు, నూనె వేసిన నీళ్లలో పది నిమిషాలపాటు పాస్తాను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అవకాడో గుజ్జు తీసిపెట్టుకోవాలి. అవకాడో గుజ్జు, పాలకూర తురుము, కొత్తిమీర, ఆలివ్ ఆయిల్, ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు, పాస్తా ఉడికించిన నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్ మీద పాన్పెట్టి వేడయ్యాక కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుని.. రుబ్బి పెట్టుకున్న అవకాడో పేస్టును వేసి ఒక నిమిషంపాటు ఉడికించి, పాస్తా వేసి మరో రెండు నిమిషాలు కలపాలి. చివరగా చిల్లీ ఫ్లేక్స్ చల్లుకుంటే అవకాడో పాస్తా సిద్ధం.