బ్రెడ్ స్లైసెస్: నాలుగు, ఫ్రెష్ క్రీం: ఒకకప్పు, చక్కెర: ఒకకప్పు, చాక్లెట్ స్ప్రింకిల్స్: ఒక టీ స్పూన్
ముందుగా బ్రెడ్ ముక్కలను నాలుగు పక్కలా గోధుమరంగులో ఉండే భాగాన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఫ్రెష్ క్రీం, పావుకప్పు చక్కెర వేసి గట్టిపడేవరకు గిలకొట్టాలి. ఒక గిన్నెలో మిగిలిన చక్కెర వేసి అరకప్పు నీళ్లుపోసి కరిగించి షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో బ్రెడ్ ముక్క పెట్టి దానిపై రెండు స్పూన్ల షుగర్ సిరప్ వేసి ఒక టేబుల్ స్పూన్ క్రీం వేసి చాకుతో సమంగా పరచాలి. ఇలాగే ఒకదానిపై ఒకటి మిగతా మూడు బ్రెడ్ముక్కలను కూడా పేర్చుకుని చుట్టూ క్రీం అద్ది చాక్లెట్ స్ప్రింకిల్స్ చల్లి అరగంటపాటు ఫ్రిజ్లో పెట్టుకుంటే చల్లచల్లని బ్రెడ్ కేక్ రెడీ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Popcorn | పాప్కార్న్ తింటే ఇన్ని లాభాలా.. అవేంటో తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు..
paneer samosa recipe | పనీర్ సమోసా తయారీ విధానం
నోరూరించే హలీమ్ లడ్డూలు.. కావాల్సినప్పుడు వేడి చేసుకుని లాగించేయడమే!!
millet upma recipe | జొన్న ఉప్మా తయారీ విధానం