నోరూరించే హలీమ్ లడ్డూలు.. కావాల్సినప్పుడు వేడి చేసుకుని లాగించేయడమే!!

Haleem laddu : రంజాన్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది.. హలీమ్. హైదరాబాద్‌లో తయారయ్యే హలీమ్ ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది. నోరూరించే ఈ వంటకం వ్యాపారం రంజాన్ సమయంలో వందల కోట్లలో ఉంటుంది. రంజాన్ తర్వాత మరుసటి ఏడాది వరకు ఏ హోటల్లోనూ కనిపించదు. ప్రజల అవసరాలు, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హలీమ్ ప్రియుల కోసం జాతీయ మాంసం అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్సీఎం) హలీమ్‌ను నిల్వ చేసుకొని, ఎప్పుడంటే అప్పుడు తినేలా పరిశోధనలు చేసింది. శాస్త్రవేత్తలు హలీమ్‌ను లడ్డూల్లా తయారు చేశారు. రుచిలో ఏమాత్రం తేడా రాకుండా, నిల్వ చేసినా ఫంగస్ రాకుండా విజయవంతంగా పరిశోధనలు చేశారు. వీటికి హాలీం బాల్స్ ( Halim ladoo ) అని నామకరణం చేశారు. పేటెంట్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేశారు కూడా. త్వరలోనే పేటెంట్ వస్తుందనే విశ్వాసాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. పేటెంట్ వచ్చాక టెక్నాలజీని ప్రైవేటు సంస్థకు బదిలీ చేస్తారు. ఆ తరువాత బహిరంగ మార్కెట్లో హలీమ్ బాల్స్ లభ్యం కానున్నాయి. వాటిని ప్యాక్ చేసి నిల్వ చేసుకోవచ్చు, సులువుగా రవాణా చేసుకోవచ్చు. ఎప్పుడైనా తినాలనుకొంటే వేడి చేసి గుటకేయొచ్చు.
హలీమ్ ప్రియుల కోసమే!
హలీమ్‌కు ప్రజల్లో ఉన్న ఆసక్తి, డిమాండ్ దృష్ట్యా దాన్ని నిల్వ చేసి తినేలా పరిశోధనలు చేశాం. రుచిలో తేడా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నాం. రంజాన్ సమయంలోనే కాకుండా మామూలు సమయాల్లోనూ ఇవి అందుబాటులో ఉంటాయి. లడ్డూల ఆకారంలో ఉండే వీటిని వేడిచేసుకొని తినేయొచ్చు. హీట్ అండ్ ఈట్ విధానంలో వీటిని తయారుచేశాం. వీటి రవాణా సులువు. పేటెంట్ వచ్చాక టెక్నాలజీని బదిలీ చేస్తాం.
–డాక్టర్ సురేశ్ దేవతక్కల్, సీనియర్ శాస్త్రవేత్త, ఎన్ఆర్సీఎం
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బ్లాక్ వాటర్ తాగుతున్న కోహ్లీ, మలైకా అరోరా.. అసలేంటి ఈ నీటి స్పెషాలిటీ..
ఈ జైలు భోజనం చాలా టేస్టీ !! మీరూ టేస్ట్ చేయాలని అనుకుంటున్నారా?
Prawn Biryani | హైదరాబాదీ బిర్యానీల్లో నయా ట్రెండ్ రొయ్యల బిర్యానీ.. ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..
Hyderabad biryani | హైదరాబాదీ బిర్యానీ ఒక్కటేనా.. ఈ పది బిర్యానీల రుచి చూశారా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

