walking | శారీరక శ్రమ లేకపోవడంతో వయసుతో సంబంధం లేకుండా రకరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అయితే, అందరూ జిమ్‌లకు వెళ్లాల్సిన పన్లేదు. రోజూ ఒక అరగంట ఇంటిముందో, దగ్గర్లోని పార్క్‌లోనో వాకింగ్ చేసినా చాలు. ఈ ముప్పై నిమిషాల నడక వల్ల పక్షవాత ప్రమాదం సగానికి సగం తగ్గుతుందట. 54 శాతం మంది పక్షవాత రోగుల్లో ప్రాణాపాయాన్నీ నడక నివారిస్తుందని కెనడాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాల్గేరీ పరిశోధకులు వెల్లడించారు. అలాగే, వారానికి కనీసం మూడు గంటలు నడిచే మహిళల్లో 43 శాతం మంది పక్షవాత ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడతారట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Reduce Weight : బరువు తగ్గించుకోవాలంటే రోజుకు ఎన్ని అడుగులు వేయాలి?
ఎక్కువ కాలం జీవించాలా.. వ్యాయామం ఎంతవసరమంటే..
40ల తర్వాత ఆరోగ్యానికి యుక్తవయస్సులో వ్యాయామం తప్పనిసరి