40ల తర్వాత ఆరోగ్యానికి యుక్తవయస్సులో వ్యాయామం తప్పనిసరి

న్యూయార్క్ : యుక్త వయస్సులో చేసే వ్యాయామం మీ వయస్సు 40 ఏళ్లు దాటిన తర్వాత అది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది. యుక్త వయస్సులో రోజువారీ వ్యాయామ దినచర్యను పాటించడం ద్వారా తర్వాతి కాలంలో అధిక రక్తపోటు, చిత్త చాపల్యం తగ్గేందుకు సహాయం చేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. యుక్తవయస్సులో వారానికి కనీసం ఐదు గంటలు వ్యాయామం చేసిన వారు అంతకంటే తక్కువ వ్యాయామం చేసేవారితో పోల్చితే 18 శాతం తక్కువ రక్తపోటుకు గురైతున్నట్లు అధ్యయనం పేర్కొంది. అంతేకాకుండా వ్యాయామ దినచర్యను 60 ఏళ్ల వరకు కొనసాగించే అలవాటు ఉన్నవాళ్లు వీటి భారిన పడే సంభావ్యత చాలా తక్కువని తెలిపింది.
ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం.. పెద్దలు ప్రతి వారం కనీసం రెండున్నర గంటలపాటు మితమైన వ్యాయామం కలిగి ఉండాలని సూచిస్తున్నాయి. కాగా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నేతృత్వంలోని అధ్యయన బృందం, శాన్ ఫ్రాన్సిస్కో (యుసిఎస్ఎఫ్) వారంలో ఐదు గంటలపాటు వ్యాయామం చేయడం శ్రేయస్కరమంది. దీని ద్వారా మిడ్ లైఫ్‌లో రక్తపోటు నుంచి రక్షించుకోవచ్చంది. ముఖ్యంగా ఇది ముప్పై, నలభై, యాభైలలో కొనసాగితే మంచిదని తెలిపింది.
అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో పరిశోధకులు 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గల సుమారు 5 వేల మందిని అనుసరించి పరీక్షించారు. వీరి వ్యాయామ అలవాట్లు, వైద్య చరిత్ర, ధూమపాన స్థితి, మద్యపానం గురించి అడిగి తెలుసుకున్నారు. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లతో కలిసి రక్తపోటు, బరువును పరిశీలించారు. వ్యాయామం రక్తపోటును తగ్గిస్తుందని తేలింది. మధ్య వయసుకు వచ్చేసరికి పెద్దలందరిలో రక్తపోటును తగ్గించే మార్గంగా వ్యాయామంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం అని అధ్యయనం సూచించింది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

