శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 28, 2020 , 23:23:01

తెలంగాణతో..‘ఆరున్నరవేల‘ అనుబంధం

తెలంగాణతో..‘ఆరున్నరవేల‘ అనుబంధం

లెక్కల అద్భుతం శకుంతలాదేవి బయోపిక్‌ త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ మీద విడుదల కానున్నది. విద్యాబాలన్‌ గణిత మేధావి పాత్రలో కనిపిస్తారు. చిత్ర దర్శకురాలు అనూ మీనన్‌. తెరవెనుక వ్యక్తి మాత్రం శకుంతలమ్మ ముద్దుల కూతురు అనుపమా బెనర్జీ. తల్లి గురించి ప్రపంచానికి తెలియాలనే ఆరాటంతో.. తనకు తెలిసిన విషయాలన్నీ అనూ మీనన్‌కు వివరించారు. ప్రివ్యూ చూశాక అనుపమ ఆనంద బాష్పాలు రాల్చారట. ‘మా అమ్మ జీవితాన్ని ఆలోచనలను అద్భుతంగా తెరకెక్కించావు’ అంటూ ఆలింగనం చేసుకున్నారట. అన్నట్టు, శకుంతలమ్మకు తెలంగాణతో కొంత అనుబంధం ఉంది. ఎలా అంటారా? ఇందిరాగాంధీ మెదక్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు.. శకుంతలాదేవి ఆమె ప్రత్యర్థిగా బరిలోకి దిగారు. ‘ఇందిర చేతిలో మెదక్‌ ప్రజలు మోసపోకూడదు. అందుకే పోటీ చేశాను’ అని చెప్పేవారామె. ఆ ఎన్నికల్లో ఆమెకు ఆరున్నరవేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. అలా, శకుంతలాదేవితో తెలంగాణ ప్రజలకు ‘ఆరున్నరవేల’ అనుబంధం! అదే సమయంలో దక్షిణ ముంబయి నుంచి కూడా బరిలోకి దిగారు.logo