సర్కారు తీరును ఎండగడుతాం : మన్నె
అధికార దాహంతో అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేమో వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో 2014కు ముందు రోజులు వచ్చాయన్నారు.
అధికార దాహంతో అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేమో వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో 2014కు ముందు రోజులు వచ్చాయన్నారు. 65 ఏండ్లు దే శాన్ని ఎలా పాలించారో.. ఇప్పుడు కూడా తెలంగాణలో అలాగే ఉన్నది. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలొస్తాయని చెప్పినట్టుగానే జరుగుతున్నది. రైతాంగం కరెంటు లేక తీవ్ర ఇబ్బందు లు ఎదురోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఆరు గ్యారెంటీల్లో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం మినహా మిగతా వాటిని సీఎం రేవంత్‌రెడ్డి గాలికొదిలేశా రు. ఎన్నికల వేళ రైతుల కోసం ఉంచిన రూ. 7,500కోట్ల రైతుబంధు నిధుల్ని తన ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులకు పంచిన ఘనత రేవంత్‌కే దక్కింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేస్తే మళ్లీ మనం చీకట్లో కి వెళ్లాల్సిందే.
ఎంపీ అభ్యర్థిగా నిలిచిన నన్ను మ రోసారి ఆశీర్వదిస్తే జిల్లా అభివృదితోపాటు కాం గ్రెస్ అసమర్థ పాలనను ఎండగట్టేందుకు పార్లమెంట్లో పాలమూరు గళాన్ని వినిపిస్తా. బీజే పీ అక్షింతలను పంచుతూ ప్రచారం చేస్తోంది. ఆ పార్టీపై మాట్లాడితే నాపై కూడా ఈడీ, ఐటీ దాడులు నిర్వహించేందుకు బీజేపీ నాయకులు సిద్ధంగా ఉంటారు. చిన్న చిన్న పొరపాట్ల తో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయాం. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించి కాం గ్రెస్ నిరంకుశ పాలనను ఎండగడుతాం. మే 13 న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒకరూ కారు గుర్తుపై ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

