e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home యాదాద్రి నిఘా కట్టుదిట్టం

నిఘా కట్టుదిట్టం

నిఘా కట్టుదిట్టం

హైవేపై నిరంతర తనిఖీ
ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు
జిల్లాలో 13 చెక్‌పోస్ట్‌లు

యాదగిరిగుట్ట రూరల్‌, మే 12: కరోనా సెకండ్‌వేవ్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన లాక్‌డౌన్‌ను యాదాద్రి భువనగిరి జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. రాచ కొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జోన్‌ డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా చేస్తున్నారు. ప్రభుత్వం మినహాయిం పు ఇచ్చినవాటికి తప్పితే ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠి న చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జి ల్లాల సరిహద్దుల్లో పూర్తిస్థాయిలో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు.

గ్రామస్థాయి నుంచి పక్కా నిఘా..
కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి ఈ సారి గ్రామాల్లో కూడా ఎక్కువ గా ఉన్న నేపథ్యంలో అన్ని మండలాలు, గ్రామాల్లో లాక్‌డౌన్‌ ను పక్కాగా అమలు చేస్తున్నారు. దీని కోసం అన్ని మండల కేంద్రాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా, గ్రామాల్లో నిరంత రం పెట్రోలింగ్‌ చేస్తున్నారు. ఎవరైనా అనవవసరంగా బయటి కి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

సుమారు 700 మంది సిబ్బంది
యాదాద్రి భువనగిరి జోన్‌ లాక్‌డౌన్‌లో సుమారు 700 మం ది పోలీస్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. లా అండ్‌ ఆర్డ ర్‌, ట్రాఫిక్‌, ఏఆర్‌, స్పెషల్‌ పార్టీతో పాలు పలు విభాగాల పోలీ సులు విధులు నిర్వహిస్తున్నారు. డీసీపీ నారాయణరెడ్డి పర్యవే క్షణలో ఆయా జోన్ల ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు రాత్రింభవళ్లు విధులు నిర్వహించనున్నారు.

మొత్తం 13 చెక్‌పోస్టులు
యాదాద్రి భువనగిరి జోన్‌లో 13 చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశా రు. ఇందులో బీబీనగర్‌ టోల్‌గేట్‌, ఆలేరు, చౌటుప్పల్‌, రామ న్నపేట, బొమ్మలరామారం, తుర్కపల్లి, రాజాపేట, అడ్డగూడు రు, వలిగొండ, పోచంపల్లి, భువనగిరిలో మూడు చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్టుల వద్ద నిరంతరం పోలీసుల నిఘా కొనసాగుతునే ఉంటుంది. ఒక్కో చెక్‌ పోస్ట్‌ వద్ద ఒక ఎస్‌ ఐ పర్యవేక్షణలో లా అండ్‌ ఆర్డర్‌, ఏఆర్‌, స్పెషల్‌ పార్టీ సిబ్బం ది విధులు నిర్వహిస్తారు.

ధాన్యం కొనుగోళ్లు.. వ్యవసాయ పనులకు ఒకే
జిల్లాలో అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొన సాగుతున్నది. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ కొనుగోళ్ల ప్ర క్రియకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభు త్వం వీటికి మినిహాయింపు ఇచ్చింది. రైతులు, హమాలీలు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి విక్రయాలు చేసుకోవచ్చు. అయితే కొనుగోలు కేంద్రాల వద్ద తప్పనిసరిగా భౌతికదూరం పాటిస్తూ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. దీంతో పాటు వ్యవసాయ పనులను కూడా మాములులాగే చేసుకోవ చ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ పనులకు వెళ్ళే వారు నేరుగా వారి పనులు వారు చేసుకోవచ్చని, వలస కూలీలు సైతం తమ పనులు తాము చేసుకోవచ్చన్నారు. జిల్లా లో ప్రధానంగా బీబీనగర్‌, బొమ్మలరామారం, చౌటుప్పల్‌ మండలాల్లో ఎక్కువగా వలస కూలీలు పని చేస్తుంటారు. దీం తో పాటు జాతీయ రహాదారిపై పెట్రోల్‌ బంక్‌లు నిరంతరంగా పని చేస్తాయన్నారు.

టెస్టులు, వ్యాక్సిన్‌లకు వెళ్లోచ్చు
కరోనా టెస్టు చేయించుకోవడానికి వెళ్లే వారు, వ్యాక్సిన్‌ తీసు కోవడానికి వెళ్లే వారు సైతం వెళ్లవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే వ్యాక్సిన్‌కు వెళ్లేవారు మాత్రం తప్ప కుండా వారు మొదటి డోస్‌ వేసుకున్న మెసేజ్‌ను పోలీసులకు చూపించాలి. తద్వారా వారిని వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు వెళ్ల డానికి పోలీసులు అనుమతి ఇస్తారు. అంతేకాగుండా గర్భీణు లు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలపై దవాఖానలకు వెళ్లే వారిని సైతం పోలీసులు అనుమతిస్తారు.

లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం యాదాద్రి భు వనగిరి జోన్‌లో లాక్‌ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తాం. ఎమ ర్జెన్సీ సేవలకు మినహా యింపు ఉంటుంది. ప్రజలంతా ప్రభుత్వం ప్రకటించిన ని బంధనలను తప్పనసరిగా పాటించాలి. అనవసర ప్రయా ణాలు చేయకూడదు. రోడ్ల మీదికి వస్తే కఠిన చర్యలు తప్పవు. అత్యవసర సేవలు, ధాన్యం కొనుగోళ్లు, ఇతరత్రా పనులు చేసుకునే వారు, ఉదయం వ్యాపార సముదాయలకు వెళ్లే ప్రజలు సైతం ఖచ్చితంగా మాస్కులు ధరించి బౌతిక దూరం పాటించాలి. లేకుంటే జరిమానా విధిస్తాం. లాక్‌డౌన్‌ విష యంలో పోలీస్‌ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది.
– నారాయణరెడ్డి, డీసీపీ, యాదాద్రి భువనగిరి జోన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిఘా కట్టుదిట్టం

ట్రెండింగ్‌

Advertisement