సోమవారం 01 మార్చి 2021
Yadadri - Aug 28, 2020 , 00:15:19

తుదిదశకు ఫ్లోరింగ్‌ పనులు

తుదిదశకు ఫ్లోరింగ్‌ పనులు

యదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రిలో పునర్నిర్మితమవుతున్న ప్రధాన ఆలయం లోపల, వెలుపల చేపట్టిన ఫ్లోరింగ్‌ పనులు తుది దశకు చేరాయి. సుమారు 4 ఎకరాల 10 గుంటల విస్తీర్ణంలో నిర్మిస్తున్న నూతన ఆలయ పనులు పూర్తికావస్తున్నాయి. ఆలయం పడమర వైపున ఉన్న  వేంచపు మంటపం సమీపంలో ఫ్లోరింగ్‌ పనులు చేపట్టారు. కృష్ణ శిలలతో నిర్మిస్తున్న ప్రధాన ఆలయానికి వన్నె తెచ్చేలా ఫ్లోరింగ్‌ కూడా నల్లరాయి బండలతోనే వేస్తున్నారు. దృఢంగా నాణ్యతతో ఉండేలా సుమారు ఫీటు మందంలో ఉన్న బండరాళ్లతో ఫ్లోరింగ్‌ వేస్తున్నారు. దక్షిణం వైపున ఉన్న  కల్యాణ మంటపం సమీపంలో ఫ్లోరింగ్‌ కుంగిపోయిన ప్రాంతంలో సాయిల్‌ స్టెబిలైజింగ్‌ చేస్తున్నారు. ఇక్కడ మినహా దాదాపు ఆలయమంతా ఫ్లోరింగ్‌ పనులు పూర్తయ్యాయి.

VIDEOS

logo