Ranveer Singh | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేశాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించిన విషయం తెలిసిందే. దిగ్గజ దర్శకుడు సుకుమార్ దర్వకత్వంలో వచ్చిన ఈ చిత్రం రూ.400 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఎంత పెద్ద చార్ట్ బస్టర్‌గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ చిత్రంలోని ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా సాంగ్‌కు రణ్వీర్ సింగ్ డ్యాన్స్ చేశారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహ రిసెప్షన్లో రణ్వీర్ సింగ్ తన మార్క్ డ్యాన్స్‌తో రెచ్చిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను దేవిశ్రీ ప్రసాద్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.
సినిమాల విషయానికి వస్తే.. రణ్వీర్ సింగ్ ప్రస్తుతం సింగం అగైన్ అనే సినిమాలో నటిస్తున్నారు. అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్, రణ్వీర్తో మల్టీస్టారర్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రం అనంతరం హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో తన తదుపరి సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది.