International Womens Day | కరీమాబాద్, మార్చి 8 : మామునూరు నాలుగో బెటాలియన్ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి కమాండెంట్ ఎం.ఐ. సురేష్ (అడిషనల్ కమాండెంట్) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అడిషనల్ కమాండెంట్ బెటాలియన్‌లోని మినిస్ట్రీయల్ స్టాఫ్‌లోని మహిళలను, బెటాలియన్‌లో విధులు నిర్వహించే మహిళలను సన్మానించి, వారికి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అడిషనల్ కమాండెంట్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అలాగే నేటి సమాజంలో స్త్రీల పాత్ర చాలా కీలకంగా ఉందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ క్రిష్ణ ప్రసాద్, వీరన్న , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రాజి రెడ్డి,కిరణ్, రవి, పురుషోత్తం రెడ్డి, వెంకటేశ్వర్లు,రాజ్ కుమార్, అశోక్, అధికారులు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్