Kho kho Selections | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 4: ఎస్జీఎఫ్ అండర్-19 బాలబాలికల ఖోఖో సెలెక్షన్స్ హనుమకొండలోని ప్రాక్టీసింగ్ హైస్కూల్లో ఉత్సాహంగా నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని కాలేజీల నుంచి బాలురు 250 మంది, బాలికలు 250 మంది (క్రీడాకారులు) పాల్గొన్నారని ఆర్గనైజేషన్ సెక్రెటరీ నేరేడ్ల శ్రీధర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్, పేట హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, కుమారస్వామి, కబడ్డీ క్రీడాకారులు కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, ఖోఖో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్యాంప్రసాద్, జూనియర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్స్ సతీష్, గోపి, జేఎన్ఎస్ కోచ్ రమేష్, హనుమకొండ జిల్లా ఆటపేట హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ సూరం రాము, గుగులోతు కిషన్, వివిధ కాలేజీల నుంచి ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, స్థానిక పాఠశాల పీఈటీ రాణి పాల్గొన్నారు.
Rain Alert | ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
Pardipuram | పర్దిపురంలో రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల నిరసన : వీడియో