జోగులాంబ గద్వాల : బస్ స్టాప్ వద్ద బస్సులు ఆపడం లేదని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దిపురం స్టేజి దగ్గర బస్సులు ఆపడం లేదని ఆరోపిస్తూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బస్సులు ఓవర్ లోడ్‌తో వస్తున్నాయనే పేరుతో ఆపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పాఠశాల సమయంలో ప్రత్యేకమైన బస్సు నడపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆగ్రహించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.