Tirupathi Express | హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వేస్టేషన్లో కరీంనగర్- తిరుపతి ఎక్స్ప్రెస్ (Tirupathi Express) రైలు ఆల్టింగ్ చేయాలని గ్రామస్తులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఉప్పల్ రైల్వే స్టేషన్కు భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, కరీంనగర్ జిల్లాలకు చెందిన ప్రజలు నిత్యం రైలు ప్రయాణం చేస్తుంటారు. సింగరేణి ప్రాంతాలు, హైదరాబాద్, విజయవాడ, వరంగల్, మహారాష్ట్ర వంటి పట్టణాలకు రైలు ప్రయాణం కొనసాగిస్తుంటారు. రైలు హాల్టింగ్ లేకపోవడంతో కాజీపేట, వరంగల్, జమ్మికుంట, పట్టణాలకు వెళ్లి రైలు ఎక్కాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే తిరుపతి ఎక్స్ప్రెస్ను రైల్వేస్టేషన్లో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. గ్రామస్తుల విజ్ఞప్తికి స్పందించిన బండి సంజయ్ కేంద్ర రైల్వే మంత్రితో మాట్లాడి కరీంనగర్- తిరుపతి ఎక్స్ప్రెస్ను నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్, సీనియర్ నాయకుడు తోట సురేష్, రఘు ప్రతాప్, వేముల శ్రీను, భూపతి ప్రవీణ్ తదితరులున్నారు.
Maha Kumbh | 41 రోజులు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. చివరి దశకు మహాకుంభమేళా
Crime news | బస్ కండక్టర్పై అమానుషం.. మరాఠీ మాట్లడలేదని మూకుమ్మడి దాడి