KU Distance Education | హనుమకొండ చౌరస్తా, మార్చి 3 : కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ప్రామాణిక పుస్తకాలను ప్రచురిస్తుందని, అభ్యర్థులందరూ వాటిని సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని కేయూ ఎస్డీఎల్సీఈ డైరెక్టర్, ప్రొఫెసర్ బి.సురేష్ లాల్ సూచించారు. ఇవాళ కేయూ దూరవిద్య కేంద్రంలో కొత్తగా తెచ్చిన సెమిస్టర్ పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రొఫెసర్ సురేష్ లాల్ మాట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీ ఈ సంవత్సరం నుంచి డిగ్రీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. సెమిస్టర్ కోర్సులకు అనుగుణంగా నిపుణులైన ప్రొఫెసర్లు, అధ్యాపకులతో ప్రామాణిక గ్రంథాలను వెలువరించినట్లు తెలిపారు.
అతి తక్కువ ఫీజులతో..
కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకున్న ప్రతీ విద్యార్థికి ప్రామాణిక పుస్తకాలను ఉచితంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులందరూ పుస్తకాలను తీసుకొని చదువుకోవాలన్నారు. గతంలో దూరవిద్య పుస్తకాలు చదివి అనేకమంది సివిల్ సర్వీస్‌తోపాటు గ్రూప్ 1, 2 ఇతర పోస్టులను సాధించారని వివరించారు. దేశంలోని అన్ని యూనివర్సిటీల కంటే కాకతీయ యూనివర్సిటీలో అతి తక్కువ ఫీజులతో డిగ్రీ ,పీజీతో పాటు ఇతర ప్రొఫెషనల్, సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నట్లు వివరించారు.
ఉత్తర తెలంగాణలోని పేరు ప్రఖ్యాతి గాంచిన కాకతీయ యూనివర్సిటీలో రెండో విడత అడ్మిషన్లు చేపట్టినట్లు తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో అడ్మిషన్లు పొందవచ్చునన్నారు. అడ్మిషన్లకు మార్చ్ 24 వరకు అపరాధ రుసుము లేకుండా గడువు ఉందని పేర్కొన్నారు. ఇతర వివరాలు కేయూ దూరవిద్య కేంద్ర వెబ్సైట్లో చూడాలని సూచించారు.
ఎస్డీఎల్సీ ఆర్ట్స్ కోర్సుల కోఆర్డినేటర్ కొట్టే భాస్కర్ మాట్లాడుతూ.. తెలుగు, హిందీ, సంస్కృతం సబ్జెక్టులలో అత్యధికమంది చదివి ఉద్యోగాలు సాధించారని చెప్పారు. సెమిస్టర్ల వారీగా సెలబస్‌లో ప్రామాణిక గ్రంథాలను తెచ్చామన్నారు. నిపుణులైన అధ్యాపకులు పాఠ్య రచయితలుగా ఉన్నారని స్పష్టం చేశారు. అభ్యర్థులు పుస్తకాల చదువుకుని వృద్ధిలోకి రావాలన్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఎస్డీఎల్సీ బుక్స్ స్టోర్స్ ఇన్ఛార్జ్ డాక్టర్ తాటికాయల కుమార్ పాల్గొన్నారు.
Kerala Man Shot Dead | ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం.. కాల్పుల్లో కేరళ వ్యక్తి మృతి
KTR | కేటీఆర్ సూచనతో కదిలిన అధికారులు.. రంగనాయక సాగర్ కాలువను సందర్శించిన అధికార యంత్రాంగం
Maoists | మనుగడ ఉండదని.. లొంగిపోయిన 14 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు