అగ్నిమాపక శాఖలో వసతులు వివరించండి : హైకోర్టు
అగ్నిమాపకశాఖలో విపత్తులను ఎదురొనేందుకు ఉన్న సదుపాయాలను వివరించాలని కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. సౌకర్యాలు, వనరులు, సాంకేతికత, పరికరాల పరిస్థితులను తెలియజేయాలని చెప్పింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): అగ్నిమాపకశాఖలో విపత్తులను ఎదురొనేందుకు ఉన్న సదుపాయాలను వివరించాలని కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. సౌకర్యాలు, వనరులు, సాంకేతికత, పరికరాల పరిస్థితులను తెలియజేయాలని చెప్పింది. ఇప్పుడున్న యంత్రాల పనితీరు, ఆక్సిజన్ మాస్లు, నీటి సౌకర్యాలు తదితర వివరాలు నివేదించాలని సూచించింది. విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం ఆదేశించింది.
2025లో పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్రమాదం జరిగి 17 మంది మరణించిన ఘటనపై విశ్రాంత న్యాయమూర్తితో జ్యుడీషియల్ వి చారణకు ఆదేశాలు ఇవ్వాలంటూ అందిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది. అగ్నిమాపకశాఖలో అత్యాధునిక వసతులు లేకపోవడంతో ప్రాణనష్టం జరిగిందని లేఖలో పేరొన్నారు. ముందుగా తెలియజేసినప్పటికీ సకాలంలో అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌లు రాలేదని తెలిపారు. ఈ కేసులో ప్రతివాదులైన హోంశాఖ ముఖ్యకార్యదర్శి, విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్ జనరల్, వైద్యఆరోగ్య శాఖ డైరెక్టర్, సిటీ పోలీసు కమిషనర్‌కు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

