మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 26 : మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్‌కు గురువారం బదిలీ ఉత్తర్వులు రావడంతో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో తహసీల్ కార్యాలయ సెంటర్లో పటాకులు కాల్చి స్వీ ట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా నాయకు లు మాట్లాడుతూ.. అతి పెద్ద గిరిజన జిల్లా అయిన మానుకోటను కలెక్టర్ అద్వైత్ రెండేండ్ల కాలంలో పదేండ్ల వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు.
పట్టాదారు పాసపుస్తకాలు, ఆర్వోఎఫ్ఆర్, భూములు, విద్య, వైద్యానికి సంబంధించిన సమస్యలను పట్టించుకోలేదని తెలిపారు. నూతనంగా వచ్చే కలెక్టర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని కోరారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు బోడ రమేశ్, గుగులోతు బీమా నాయక్, ఎల్ది మల్లయ్య, రవీందర్, బాలాజీ నాయక్, వస్రాం నాయక్, బాలకృష్ణ, సంతోష్, అశోక్ పాల్గొన్నారు.