చెత్తకుప్పల్లో దవాఖాన మందులు
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పాత సీహెచ్సీ పోస్టుమార్టం గదిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన మిరిచిపోకముందే దవాఖానలోని మందులు చెత్తకుప్పలో పడేసిన ఘటన వెలుగుచూసింది. కల్వకుర్తి రహదారి పక్కన నిర్మించిన నూతన భవనంలోకి 2023లో పాత సీహెచ్సీని షిఫ్ట్ చేశారు.
జడ్చర్ల టౌన్, జూలై 25 : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పాత సీహెచ్సీ పోస్టుమార్టం గదిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన మిరిచిపోకముందే దవాఖానలోని మందులు చెత్తకుప్పలో పడేసిన ఘటన వెలుగుచూసింది. కల్వకుర్తి రహదారి పక్కన నిర్మించిన నూతన భవనంలోకి 2023లో పాత సీహెచ్సీని షిఫ్ట్ చేశారు. వైద్యపరికరాలతోపాటు మెడిసిన్స్ను కొత్త భవనంలోకి తరలించా ల్సి ఉండగా.. వైద్యాధికారులు నిర్లక్ష్యంగా పాత దవాఖానలోనే వదిలేశారు.
రోగులకు ఉపయోగపడే ఆ మందులు పాత దవాఖాన ఆవరణలోని చెత్తకుప్పలో వెలుగుచూశాయి. ప్రభుత్వం సరఫరా చేసిన మెడిసిన్స్ ఇలా చెత్తకుప్పలో పడేసి రూ.లక్షలు దుర్వినియోగం చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దవాఖాన సూపరింటెండెంట్ హర్షదుల్లాను వివరణ కోరగా.. కరోనా సమయంలో వచ్చిన మందులు రోగులకు పంపిణీ చేశాక కొన్ని మిగిలిపోయాయని, వాటిలో చాలా వరకు ఎక్స్పైరీ కావడంతో అక్కడే ఉంచినట్టు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

