దర్శక ద్వయం రాజ్, డీకేలలో ఒకరైన రాజ్ నిడిమోరు ‘మా ఇంటి బంగారం’ సినిమాకు కథ అందించి వంద కోట్ల విజయాన్ని అందుకున్నారు. తెలుగులో మహిళా ప్రధాన చిత్రానికి వందకోట్లు రావడం ఇదే ప్రథమం. ఈ జోష్ని ఇలాగే కొనసాగిస్తూ, తన మిత్రుడు కృష్ణ దాసరి(డీకే)తో కలిసి రాజ్ నిడియోరు మరో లేడీఓరియెంటెడ్ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఈ సారి వీరి కథకు నాయికగా రష్మిక మందన్నను ఎంచుకున్నారట.
ఇటీవలే రష్మికకు లైన్ కూడా వివరించారట. ఆమె కూడా రాజ్డీకేలతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు వినికిడి. ప్రస్తుతం కథాచర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. యూనివర్సల్ అప్రోచ్ ఉన్న డైరెక్టర్లు రాజ్-డీకేలతో రష్మిక పనిచేస్తుండటంతో ఈ ప్రా జెక్ట్పై ఆడియన్స్లో ఆసక్తి నెలకొన్నది.