హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 9: కాకినాడ జేఎన్టీయులో ఈనెల 10 నుంచి 14 వరకు జరిగే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ (పురుషుల) టోర్నమెంట్‌కు విశ్వవిద్యాలయ టీంను ఎంపిక చేసినట్లు కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై.వెంకయ్య తెలిపారు.
వీరిలో యూనివర్సిటీ వ్యాయమ కళాశాల నుంచి ఎం.లక్ష్మణస్వామి, ఖమ్మం విశ్వవిద్యాలయ వ్యాయమ కళాశాల నుంచి జే.సాయికిరణ్, హనుమకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి కే.సాయికుమార్, అశ్వరావుపేట్ ప్రభుత్వ డిగ్రీ నుంచి ఆర్.వెంకటేశ్వర్రావు, హనుమకొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి కే.ఉదయకిరణ్, ములుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి బి.శివకుమార్, జి.వసంతరావు ఎంపికయ్యారు.
అలాగే మంచిర్యాల్ సి.వి.రామన్ డిగ్రీ కాలేజీ నుంచి ఎ.సంజీవ్‌కుమార్, ఖమ్మం ఎస్ఆర్అండ్ బి.జి.ఎన్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి టి.రామచరణ్ అంజి, ఆదిలాబాద్, బొత్, టీటీడబ్ల్యూఆర్డీసీ నుంచి ఐ.భీమ్రావు, పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి పి.ఆదినారాయణ, బొల్లికుంట వాగ్దేవి కాలేజీ నుంచి పి.ప్రమోద్, వరంగల్ కిట్స్ కాలేజీ నుంచి బి.రోషణ్, మణుగూరు టీటీడబ్ల్యూఆర్డీసీ టి.జశ్వంత్ ఉన్నట్లు తెలిపారు. వీరికి బొల్లికుంట వాగ్దేవి కాలేజీ వ్యాయమ అధ్యాపకుడు వి.రామాంజనేయులు కోచ్ కం మేనేజర్‌గా వ్యవహరిస్తారని వెంకయ్య వెల్లడించారు.