Sardar vallabhai patel | హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 15 : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం తరుపున కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా అక్టోబర్ 6వ తేదీన సర్దార్ 150 ఐక్యత మార్చ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు.
బుధవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో అన్వేష్ మాట్లాడుతూ.. ప్రచారదశ సర్దార్ 150 యూనిట్ మార్చ్అనేది జిల్లాస్థాయి పాదయాత్రలు(31 నుంచి నవంబర్ 25 వరకు) అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అన్ని జిల్లాల్లో మూడు రోజుల పాటు 8 నుంచి పది కిలో మీటర్ల ప్రాంతాన్ని అనుసంధానం చేసేలా నిర్వహించనున్నట్లు చెప్పారు.
జాతీయ మార్చ్..
ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా హెల్త్‌క్యాంపులు, సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంపై ప్రసంగాలు, డ్రగ్స్ రహిత భారతదేశంపై ప్రతిజ్ఞలు చేయనున్నట్లు చెప్పారు. పాదయాత్రలో భాగంగా పటేల్ చిత్రపటానికి, విగ్రహానికి నివాళులర్పించడం, ఆత్మ నిర్బర భారత్ ప్రతిజ్ఞ చేయడం, ఏకభారత్ ఆత్మనిర్వర్భారత్ వంటి వాటిపై సాంస్కృతిక కార్యక్రమాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు.
నవంబర్ 26 నుంచి డిసెంబర్ 6 వరకు జాతీయ మార్చ్ జరగనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్ఎస్ఎస్ రీజినల్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, డాక్టర్ కె.రాంకుమార్‌రెడ్డి, డాక్టర్ జి.శివకుమార్, శ్రీధర్ సూరనేని, ప్రోగ్రాం సహాయకులు బానోతు దేవిలాల్, డాక్టర్ ఇస్తారి పాల్గొన్నారు.
Kumuram Bheem | కుమ్రం భీం పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి : పెందోర్ దాదిరావు
Murder | తెనాలి చెంచుపేటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ఖరారు చేసిన బీజేపీ