భీమదేవరపల్లి, జనవరి 13 : నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులు గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కొత్తకొండ సీనియర్ సిటీజన్ మంద శరత్ చంద్రారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలో నూతనంగా ఎన్నికైన సర్పంచి సిద్ధమల్ల రమ, వార్డు సభ్యులను ఆయన సతీమణి సురక్షితాదేవి తో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు కొత్తకొండ సర్పంచ్ స్థానం కేటాయించడం అభినందనీయమన్నారు.
మహిళలు ఆకాశంలో సగం అని, గ్రామాభివృద్ధిలో మహిళా సర్పంచి రమ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కొత్తకొండ అంటే ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన వీరభద్ర స్వామి దేవస్థానం మాత్రమే కాదని, గ్రామంలో పారిశుధ్యం, డ్రైనేజీ, మరుగుదొడ్లు, వీధి దీపాలు, తాగునీరు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి వార్డు సభ్యుడు తమ వార్డులో అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
గ్రామాభివృద్ధి లో తాను సైతం పాలు పంచుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధమల్ల రమ, ఉప సర్పంచ్ తాళ్ళపల్లి యాదగిరి, వార్డు సభ్యులు నక్క సరిత, చిట్యాల ఉమారాణి, పయ్యావుల రాజు, బుర్ర రంజిత్, బండి రమ, సంపంగి శ్రీనివాస్, కంకల యమున, దేవరాజుల నాగరాజు, సిద్ధమల్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.