RTI | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 25 : హనుమకొండ జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఆర్టీఐ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు చంటి ముదిరాజ్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ అనేది భారత సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం, ప్రధాన సమాచార కమిషనర్, ఇతర సమాచార కమిషనర్ల నియామకానికి సిఫారసులు చేసే కమిటీ. ఈ కమిటీలో ప్రధానంగా కేంద్ర పాలకులు, ముఖ్యమంత్రి, పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు మొదలైనవారు సభ్యులుగా ఉంటారన్నారు. ప్రధానమంత్రి కమిటీ చైర్మన్‌గా ఉంటారని, తదితరులు సభ్యులుగా ఇందులో ఉంటారని, ఈ కమిటీ ప్రభుత్వ సమాచార కమిషనర్లను నియమించి, సమగ్ర పర్యవేక్షణ చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేష్‌గౌడ్, రాష్ర్ట అధ్యక్షురాలు సురా స్రవంతి, రాష్ర్ట ఉపఅధ్యక్షులు గోపినాథ్ కట్టేకోల, మీసాల విజయ్ జనగాని నాగరాజ్, కొంగటి రాజ్‌కుమార్, పల్లంకొండ విజయ్‌సూర్య, పెరుమాండ్ల రవి, పసునూటి కుమార్‌స్వామి, పోడేటి శివ, బైరగోని ధనుష్, కాశబోయిన అరవింద్, మస్కా అన్వేష్ గోల్కొండ రజనీకాంత్, జన్ను సదానందం, కుమ్మరి కుమార్‌స్వామి, తుపాకుల దశరథం, కోవరాజు సాగర్, ఎర్రోళ్ల సతీష్ పాల్గొన్నారు.
అక్టోబర్ 12న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరగనున్న ఆవిర్భావ దినోత్సవ మహాసభను విజయవంతం చేయాలని కమిటీ పిలుపునిచ్చింది.
Woman Molest | వివాహితపై పోలీసుల అఘాయిత్యం.. కేసు నమోదు
Mulugu | ములుగు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం..
KCR | కొంపెల్లి వెంకట్ గౌడ్ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు : కేసీఆర్