దుగ్గొండి, ఏప్రిల్,14 : ఈనెల 27న ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు మండలం నుండి భారీగా తరలి వెళ్లి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుకిన్ రాజేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం గిర్నిబావి సెంటర్లో చలో వరంగల్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను అత్యధికంగా తరలించాలని క్లస్టర్ ఇన్చార్జీలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి, మాజీ ఎంపీపీ కాట్ల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జి కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, బొంపెల్లి రజనీకర్ రెడ్డి, ల్యాండే రమేష్, గుండెకారి రంగారావు, తోటకూరి రాజు, కామిశెట్టి ప్రశాంత్, గుడిపల్లి జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపిటిసి పిండి కుమారస్వామి, సింగతి రాజన్న, మోహన్, మాజీ సర్పంచులు ఉమేష్ రెడ్డి, తిరుపతి రెడ్డి, తుమ్మలపల్లి మహేందర్, గుడిపల్లి మల్లారెడ్డి, సద్ది ఐయల్ రెడ్డి, నగనబోయిన తిరుపతి, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.