Pyeloplasty | హనుమకొండ రస్తా, జనవరి 17: అధునాతన త్రీడి సాంకేతికతతో మొదటిసారిగా వరంగల్ జిల్లాలో రెండేళ్ల చిన్నారి పాపకు పైలోప్లాస్టి ఆపరేషన్లు దిగ్విజయంగా పూర్తి చేసినట్లు హనుమకొండలోని శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్ యూరాలజిస్ట్ డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. శనివారం హనుమకొండ వేయిస్తంభాల దేవాలయం ఎదురుగా ఉన్న దవాఖానలో జరిగిన సమావేశంలో డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.
మహబూబాబాద్‌కు చెందిన రెండు సంవత్సరాల పాప వి వేదాంన్షికు కిడ్నీ నుంచి మూత్రం తీసుకువెళ్లే నాళం సన్నబడినట్లు డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లగా రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతాయని చెప్పడంతో తమ ఆసుపత్రిని సందర్శించినట్లు చెప్పారు. తక్కువ ఖర్చుతో చికిత్సలు విజయవంతంగా పూర్తిచేసి 72 గంటల్లోనే ఇంటికి పంపినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో డాక్టర్ రఫీ, అనస్తీశ వైద్యుడు డాక్టర్ సామ్రాట్ పాల్గొన్నారు. ఇదే తరహాలో మరో మూడు త్రీడి లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు యూరాలజిస్ట్ డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
Konaseema | కోనసీమలో రికార్డింగ్ డ్యాన్స్ కలకలం.. డాన్సర్లను బట్టలు విప్పమన్న జనసేన నేత!