Singer Chinmayi | కోనసీమలో సంక్రాంతి వేడుకల వేళ చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా పెను దుమారం రేపుతోంది. రాజోలు నియోజకవర్గంలో నిర్వహించిన రికార్డింగ్ డ్యాన్స్‌లో ఒక స్థానిక రాజకీయ నేత ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అనుచరుడొకరు మలికిపురం మండలం గోగన్నమట్టం గ్రామంలో రికార్డింగ్ డ్యాన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న మహిళా డాన్సర్ల పట్ల ఆయన అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో దుస్తులు విప్పేయాలంటూ ఆయన పెట్టిన కండీషన్లు చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు నేతపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
అయితే ఈ ఘటనపై ప్రముఖ సింగర్ చిన్మయి తీవ్రంగా స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ.. “స్టేజ్ మీద ఉన్న అమ్మాయిలను అందరి ముందు ఇలా అవమానిస్తారని అస్సలు ఊహించలేదు. ఒక వ్యక్తి అమ్మాయిలను బట్టలు విప్పమని అడుగుతుంటే, అక్కడున్న జనం చప్పట్లు కొట్టడం అత్యంత దారుణం. అక్కడ కనిపిస్తున్న భాష, ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఇది పూర్తిగా అశ్లీల గందరగోళం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చిన్మయి చేసిన ఈ ట్వీట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరూ నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ.. పండుగ ముసుగులో ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించే నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తున్న మరికొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.
I didnt think something like this would happen to girls in front of a CHEERING audience.
Man tells these girls to strip. And the audience cheers.
I dont know if I should be sad or happy that this sh*t is getting exposed.
No wonder the abuse and the language here is so vile.… pic.twitter.com/V9Ren2eNVr
— Chinmayi Sripaada (@Chinmayi) January 16, 2026