హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 22 : మధ్యభారతంలో ఆదివాసులపై పాలకులు కొనసాగిస్తున్న మారణకాండను ఆపివేయాలని కోరుతూ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 24న హనుమకొండ అంబేద్కర్ భవన్లో ‘ఆదివాసీ హక్కులు-కార్పొరేటీకారణ, కగార్ హత్యాకాండ – కాల్పుల విరమణ’ అనే అంశంపై బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు డీఎస్ఏ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి మర్రి మహేష్ తెలిపారు.
శుక్రవారం కాకతీయ విశ్వవిద్యాలయ లైబ్రవరీ వద్ద డీఎస్ఏ, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్య భారత దేశంలో ఆదివాసులపై జరుగుతున్న జాతి హనాన్ని ఆపివేయాలని, ఆదివాసీ చట్టాలను అమలుచేయాలని, అడవిలో ఉన్న సహజవనరులను కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలకు వ్యతిరేకంగా పౌరులు, ప్రజాస్వామికవాదులు పోరాడాలని వారన్నారు. కార్యక్రమంలో డీఎస్ఏ జిల్లా కన్వీనర్ శివ, నాయకులు సునీల్, శేఖర్, నరేష్, పీడీఎస్యూ నాయకులు వరుణ్, మురళి, వంశీ పాల్గొన్నారు.