హనుమకొండ : హనుమకొండ(Hanumakonda) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 120 వీధి కుక్కలను(Stray dogs) చంపి పాతిపెట్టిన సంఘటన స్థానికంగా కలకలంరేపింది. జిల్లాలోని
శాయంపేట, ఆరేపల్లిలో గ్రామ పంచాయతీ సిబ్బంది కుక్కలను చంపి పాతిపెట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు తవ్వకాలు జరిపి కళేబారాలను వెలికితీ శారు. ఈ దారుణానికి ఒడిగట్టిన సర్పంచ్ సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.
కాగా, మరోవైపు వీధి కుక్కలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరిపై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. కుక్కల దాడిలో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. ప్రభుత్వం శునకాలకు స్టెరిలైజేషన్ చేయకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందిచి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.