Christian Missionaries | హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 8: క్రిస్టియన్ మిషనరీ ఆస్తులను భూకబ్జాదారుల నుంచి రక్షించాలని హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్(సీబీసీ) అధ్యక్షుడు విజయ్ స్వరూప్, సెక్రెటరీ క్రిస్టఫర్ రూబెన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని క్రిస్టియన్ మిషనరీ ఆస్తులను కబ్జాదారుల నుంచి రక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు.
అనంతరం మిషన్ హాస్పిటల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్స్వరూప్, క్రిష్టోఫర్ రూబెన్ మాట్లాడుతూ.. మిషనరీ ఆస్తులు ఉమ్మడి క్రైస్తవుల ఆస్తి.. వాటిని అమ్మడానికి, కొనడానికి ఎవరికి ఎలాంటి హక్కులు లేవని.. ఆ ఆస్తులను సేవ కోసం మాత్రమే వినియోగించాలన్నారు. కొంతమంది మిషనరీ ఆస్తులను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారిని స్థానిక ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ డాక్టర్ కడియం కావ్య సహకారంతో అడ్డుకొని మిషనరీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత క్రైస్తవులపై ఉందన్నారు.
గుండాలతో భూమి కబ్జా చేసేందుకు..
ఆంధ్రాలో పీఏబీసీ అనే సంస్థ క్రైస్తవేతరుడైన మండల శ్రీనివాసరెడ్డి ఈ మిషనరీ భూములను పొందేందుకు ప్రయత్నిస్తే మద్రాస్ హైకోర్టు ద్వారా స్టే తేవడం జరిగిందని, 30 సంవత్సరాల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత క్రైస్తవ లోకానికి మద్రాస్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. మరోసారి గుండాలతో ఈ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని క్రైస్తవులందరూ ప్రతిఘటించి మిషనరీ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఈ సమావేశంలో సీబీసీ జాయింట్ సెక్రెటరీ విద్యాకర్, వైస్ ప్రెసిడెంట్ జాన్సన్ ప్రసాద్, కోశాధికారి విల్సమ్ విజయకుమార్, కార్పొరేటర్ పోతుల శ్రీమన్నారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసెస్ ఆనంద్, బోడ డిన్నా, తోట పవన్, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Nizampet | నిజాంపేటలో ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలు
Madhya Pradesh | పెండ్లి కార్డులు పంచడానికి వెళ్తుండగా బైకును ఢీకొన్న ఆడి కారు.. ముగ్గురు మృతి