Mulukanoor Dairy | భీమదేవర పల్లి, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన కార్యాలయంలో అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సమితి స్థాయిలో అత్యధికంగా పాలు సరఫరా చేసిన సభ్యులకు బహుమతులు ప్రధానం చేశారు.
ములుకనూరు డెయిరీ చరిత్ర, పనిచేసే విధానం, అందిస్తున్న సేవలు తెలిపే కొత్తగా తయారు చేసిన డైరీ- బ్రోచర్‌ను అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ, పాలక వర్గం, జనరల్ మేనేజర్ మార్పాటి భాస్కర్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు. అనంతరం డెయిరీ మహిళా సిబ్బందిలో నలుగురికి పురస్కారాలు అందచేశారు.
Mulukanoor Dairy
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్