హనుమకొండ (ఐనవోలు): రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు (KR Nagaraju) సూచించారు. ఐనవోలు మండలంలోని నర్సింహులగూడెంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిదాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతు అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. విశ్వవిదాయలం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించడం ఒక మంచి కార్యక్రమన్నారు. అధునాతన వ్యవసాయంపై అవగాహన కల్పించి చైతన్యవంతుల చేయడం ద్వారా రైతులు పంటలో మంచి దిగుబడి సాదిస్తారన్నారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు రసాయనిక ఎరువులను, పురుగుల మందులను తగ్గించి పంట పండించడం రైతులకు ఎంతో లాభదాయకమని చెప్పారు.
తక్కువ యూరియా వాడకంతో సాగు ఖర్చు తగ్గించుకోవాలని అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ డాక్టర్ ఆర్ ఉమారెడ్డి రైతులకు సూచించారు. అవసరం మేరకు మాత్రమే రసాయనాల వినియోగించడం వల నేల తల్లి సారాన్ని కపాడిన వల్లమవువుతామని చెప్పారు. రైతులు ఎరువుల దుకాణాల్లో కొనుగోలు చేసిన విత్తనాలకు ఖచ్చితంగా రశీదు తీసుకోవాలని, పంట పూర్తయ్యే వరకు దానిని భద్రపరుచుకోవాలని తెలిపారు. సాగు నీటిని ఆదా చేసి భవిష్యత్ తరాలకు అందించడం మన అందరి బాధ్యత అని చెప్పారు. పంట మార్పిడిని పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందాలని సూచించారు. చెట్లను పెంచి పర్యావరణాన్ని కపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పీ. అనుష, నందిని, డీ. అశ్విని, జిల్లా వ్యవసాయాధికారి రవీందర్ సింగ్, తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఏవో సునిల్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో రఘుపతిరెడ్డి, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.