Leather Industry | హనుమకొండ, జులై 12 : దేశాయిపేట తోళ్ల పరిశ్రమను మినీ లెదర్ పార్కుగా మార్చాలని కేవీపీఎస్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ రాంనగర్లోని కేవీపీఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి సాంబయ్య అధ్యక్షతన కేవీపీఎస్ హనుమకొండ జిల్లా కమిటి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న సంపత్ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా దేశాయిపేటలోని తోళ్ల పరిశ్రమను మూసివేయడంతో దానిమీద ఆధారపడి జీవిస్తున్న అనేకమంది ఉపాధి కూలిపోయారని, పరోక్షంగా కొన్ని వందల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయని, ఆ తోళ్ల పరిశ్రమ వలన నీరు కలుషితం అవుతుందని, దుర్గంధం, చెడు వాసన వస్తుందని చుట్టుపక్కల కాలనీలోని ప్రజలు ఫిర్యాదులు చేయడంతో అప్పటి ప్రభుత్వం ఆ పరిశ్రమను మూసివేసిందని అన్నారు.
ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి..
పరిశ్రమ మూయడం వలన ఉపాధి కోల్పోయిన వారందరికీ మామునూరులో మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మించి అందులో వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మాణం నేటికీ కలగానే మిగిలిపోయిందని, అనేకమంది నిరుద్యోగులు టెక్స్టైల్ పార్క్ నిర్మాణం పూర్తయితే తమకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆర్థికంగా కుటుంబాలు బాగుపడతాయని ఎదురుచూస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణం పూర్తి చేసి ఈ జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, అలాగే దేశాయిపేట తోళ్ల పరిశ్రమ భూములను అందులోని మిషనరీలను ఆజాంజాహి మిల్లు వలే ఈ ప్రభుత్వం అమ్మడానికి ప్రయత్నాలు చేస్తుందని, ఆ భూములను అమ్మకుండా అందులో మినీ టెక్స్టైల్ పార్కు నిర్మించి నిరుద్యోగ యువతకు, ఉపాధి లేని దళితులకు లెదర్ సంబంధిత ఉత్పత్తుల శిక్షణనిచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని అలా కాకుండా ఆ భూములను వేరే వాటికి కేటాయించిన, అమ్మిన కేవీపీఎస్ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దూడపాక రాజేందర్, ముడుసు నారాయణ, సహాయ కార్యదర్శులు గడ్డం అశోక్, దానబోయిన రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు శనిగరపు జనార్ధన్, శనిగరపు భాస్కర్, ఎనగందుల బాబురావు, బొట్ల సారంగం, సిరిమిళ్ళ సుభద్ర పాల్గొన్నారు.
Siddipet | సాగు నీటి కోసం.. ఆశగా రైతుల ఎదరుచూపులు
Army Jawan Donate | ఆర్మీ జవాన్ ఆదర్శం.. మొదటి వేతనం ఆలయానికి అందజేత
BRS | బీఆర్ఎస్ హాయంలోనే గ్రామపంచాయతీల అభివృద్ధి :ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి