TGSRTC labourers | హనుమకొండ, సెప్టెంబర్ 20 : హనుమకొండ ఆర్టీసీ బస్టాండ్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల పట్ల వివక్షత చూపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, కార్మికులకు పనిభద్రత కల్పించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందసంపత్ డిమాండ్ చేశారు.
శనివారం హనుమకొండలో జరిగిన కేవీపీఎస్ జిల్లా అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హనుమకొండలోని ఆర్టీసీ బస్టాండ్లలో ఎక్కువగా దళిత మహిళలు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్నారన్నారు. చాలీ చాలని జీతాలతో అవస్థలు పడుతున్నారని, కుటుంబాన్ని పోషించేందుకు విధి లేని పరిస్థితుల్లో ఈ పనులు చేస్తున్నారని అన్నారు. అయితే కొందరు సంబంధిత అధికారులు నిత్యం వారిని వేధింపులకు గురి చేస్తూ అనేక రకాలుగా అవమానపరుస్తున్నారని, దీని వెంటనే అరికట్టాలన్నారు.
గత 15 సంవత్సరాలుగా వరంగల్ -1 డిపోలో పనిచేస్తున శనిగరపు పూర్ణ అనారోగ్యంగా ఉండటంతో అనుమతి తీసుకొనే పనికి రాకుంటే వివిధ కారణాలు చూపుతూ దుర్భాషలాడి పనిలో నుంచి తీసివేసారని, ఇట్టి అధికారిపై చర్యలు తీసుకొని ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని పని భద్రత కల్పించాలన్నారు.
రాజకీయ మెప్పు పొందేందుకు కొందరు అధికారులు, కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకొని తొలిగించిన వారిని వెంటనే పనిలోకి తీసుకోవాలని లేని పక్షంలో కేవీపీఎస్ ఆద్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కేబీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి సాంబయ్య, జిల్లా మాజీ అధ్యక్షుడు మంద మల్లేశం, జిల్లా నాయకులు ఐత మారుతి, ఒంటెల పాపయ్య, జంపాల రమేష్ పాల్గొన్నారు.
Katamaya Kits | గీతా కార్మికులకు కాటమయ్య కిట్లు పంపిణీ చేయాలి
Kothagudem Urban : ‘దసరా పండుగకు నేటి నుంచి ప్రత్యేక బస్సులు.. 50 శాతం అదనపు చార్జీలు’
Kothagudem Urban : పెన్షన్లు పెంచి పంపిణీ చేయాలి : దాసరి సారధి