Hockey competitions | హనుమకొండ చౌరస్తా, జనవరి 11 : ఈ నెల 12వ తేదీ నుంచి 16 వరకు చెన్నై సత్యభామ యూనివర్సిటీలో జరిగే సౌత్‌జోన్ ఈస్ట్ ఇంటర్ యూనివర్సిటీ హాకీ పోటీలకు కాకతీయ యూనివర్సిటీ టీంను ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వై వెంకయ్య తెలిపారు.
కేయూ నుంచి జి.ప్రవీణ్, ఆదిలాబాద్ టీజీటీడబ్ల్యూఆర్డీసీ నుంచి యు అరవింద్, వి.సుదర్శన్, ఎం నగేశ్, సీహెచ్ వంశీ, ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి షేక్ సోహెల్ అబ్బాస్, బొల్లికుంట వాగ్వే ఇంజినీరింగ్ కాలేజీ నుంచి మహమ్మద్ ఉస్మాన్ గనిఖాన్, హనుమకొండ అరోరా డిగ్రీ కాలేజీ నుంచి వి సందీప్, బొల్లికుంట వీసీపీఈ నుంచి ఏ అఖిల్, ఎన్ మల్లేశ్ ఎంపికయ్యారయ్యారు.
అదే విధంగా హనుమకొండ న్యూ సైన్స్ డిగ్రీ కాలేజీ నుంచి బి అభినాష్, ఆదిలాబాద్ డిగ్రీ కాలేజీ నుంచి కె .జంగు, ఆదిలాబాద్ టీజీటీడబ్ల్యూఆర్డీసీ నుంచి ఏ మారుతి, హనుమకొండ కేడీసీ నుంచి బి అఖిల్, కేయూ నుంచి జి రాజు, కె వెంకటేశ్, వరంగల్ కిట్స్ నుంచి సయ్యద్ జునైద్ అహ్మద్ ఉన్నారు. వీరికి బొల్లికుంట వాగ్దేవి కాలేజీ పీడీ సయ్యద్ యాసీన్ కోచ్‌గా, హనుమకొండ కనిష్క డిగ్రీ కాలేజీ పీడీ కె రాకేష్ మేనేజర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు.
Early Sankranti celebrations | తిమ్మాపూర్‌లో ప్రైవేట్ పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు
NTR | ‘వార్ 2’ దెబ్బతో తారక్ ప్రాజెక్టులకు బ్రేక్? … త్రివిక్రమ్ మూవీ కూడా క్యాన్సిల్ అయ్యిందా!