Sundilla Devasthanam | గోదావరిఖని : గోదావరిఖని పట్టణానికి సమీపంలోని సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం డైరెక్టర్ గా పట్టణానికి చెందిన కార్మిక నాయకుడు చింతల రాజిరెడ్డి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరై పాలకవర్గంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.
సింగరేణి సంస్థలో కార్మికుడిగా పనిచేసి శ్రమశక్తి అవార్డు సాధించిన చింతల రాజి రెడ్డి, సాజక్ క్రాఫ్ట్ సంఘాలకు నాయకత్వం వహించి సింగరేణి కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడిన ఆయనకు గుర్తింపునిచ్చి సుందిళ్ల దేవస్థానం డైరెక్టర్ గా నియమించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆయన నియామకం పట్ల అన్ని వర్గాలకు చెందిన పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.