NTR |యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ఈ మధ్య అనూహ్యమైన మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన స్పై యాక్షన్ మూవీ ‘వార్ 2’ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో, ఎన్టీఆర్ చేయాల్సిన పలు ప్రాజెక్టులు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇప్పటికే ‘దేవర’ సీక్వెల్ ‘దేవర 2’ ఆగిపోయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే సమయంలో హిందీలో చేయాల్సిన మరో స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను కూడా పక్కన పెట్టారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందా? లేదా? అన్నది కూడా డౌట్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఎన్టీఆర్ మూవీ కూడా ఆగిపోయిందన్న వార్తలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి.
‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా ఉంటుందని అప్పట్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఈ కాంబినేషన్లో సినిమా అధికారికంగా ప్రకటించబడినా, అది కార్యరూపం దాల్చలేదు. ఆ ప్రాజెక్ట్ స్థానంలోనే ఎన్టీఆర్ కొరటాల శివతో ‘దేవర’కు కమిట్ అయ్యారు. అయితే ఆ సినిమా కూడా సౌత్‌లో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, నార్త్ మార్కెట్లో మాత్రం మంచి వసూళ్లు సాధించింది. తర్వాత ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మళ్లీ కలవబోతున్నారని, ఈసారి మైథలాజికల్ కథతో సినిమా రూపొందించనున్నారని ప్రచారం జరిగింది. ఇప్పటివరకు ఎవరూ చూపించని ఓ కొత్త కథను తెరకెక్కించబోతున్నారని, త్రివిక్రమ్ రైటింగ్ వేరే లెవల్లో ఉంటుందని నిర్మాత నాగవంశీ స్వయంగా చెప్పారు. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే బుక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని, ఆ పుస్తకంతో ఎన్టీఆర్ పలుమార్లు ఎయిర్‌పోర్ట్‌లలో కనిపించడంతో ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైందనే అభిప్రాయం ఏర్పడింది. ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ఇదేనని అంతా భావించారు.
కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అయినట్లు సమాచారం. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ మైథలాజికల్ మూవీ ఇప్పుడు అల్లు అర్జున్ వద్దకు వెళ్లిందన్న టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. నిజానికి ‘అల వైకుంఠపురములో’ తర్వాత త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో మరో సినిమా రావాల్సి ఉండగా, మధ్యలో బన్నీ అట్లీతో సినిమా చేయడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు మాత్రం త్రివిక్రమ్ తిరిగి బన్నీతోనే సినిమా చేయడానికి రెడీ అయ్యారని, అదే మైథలాజికల్ కథకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ చిత్రాన్ని కూడా నాగవంశీనే నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చేతిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ ఒక్కటే ఉంది. ఆ తర్వాత సినిమాలపై స్పష్టమైన క్లారిటీ లేకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఒక పాన్ ఇండియా స్టార్‌కు ఇలాంటి పరిస్థితి రావడం ఆశ్చర్యంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.