
Early Sankranti celebrations | తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస రామానుజన్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి ముచ్చట గొలిపే ముగ్గులు వేశారు. భోగి మంటలు వేసి ఆనందంగా గడిపారు. విద్యార్థులను కరస్పాండెంట్లు బర్మయ్య, జితేందర్, ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. ముగ్గులు వేసిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
అక్షరలో సంక్రాంతి వేడుకలు
తిమ్మాపూర్ మండలం అల్గునూరులోని అక్షర ఇంటర్నేషనల్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నూతన వస్త్రాలు ధరించి సాంప్రదాయ పద్ధతిలో ముగ్గులు వేసి అలరించారు. ఈ సందర్భంగా బోగి మంటలు వేశారు. ఉపాధ్యాయులు బోగి పండ్లతో ఆశీర్వదించారు. సంస్కృతీ సంప్రదయాలను కాపాడుకోవాలని ఇన్చార్జి ప్రిస్సిపాల్ మహేష్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.