హనుమకొండ(ఐనవోలు): తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అకాశమంత ఎలుగెత్తి చాటిన వ్యక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జన సమీకరణ కోసం మండల ఇన్చార్జీలు గుజ్జ గోపాల్ రావు, ఇండ్ల నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. కాగా, సమావేశంలో మధ్యలో దయాకర్ రావు కేటీఆర్కు ఫోన్ చేసి రజతోత్సం సమావేశం కోసం దిశ నిర్దేశం చేయాలని కోరారు. ఈ మేరకు కేటీఆర్ మాట్లాడుతూ.. స్వతంత్రం వచ్చిన 78 ఏళ్ల చరిత్రలో మన తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలుగా పుట్టి 25 ఏళ్ల పాటు కొనసాగుతున్నవి రెండు పార్టీలేనని తెలిపారు. అందులో ఒకటి తెలుగుదేశం. రెండోది బీఆర్ఎస్ అన్నారు.
బీఆర్ఎస్ 24 ఏళ్లు పూర్తి చేసుకోని 25 ఏటా అడుతుపెడుతున్న సందర్భంగా వరంగల్లో జరుగబోయే 25 ఏళ్ల రజతోత్సవ సభను గతంలో జరిగిన సభల కన్న గొప్పగా చేపట్టాలన్నారు. రాష్ట్రం మొత్తానికి ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో నందనం సొసైటీ వైస్ చైర్మన్ చందర్ రావు, సొసైటీ డైరెక్టర్లు కుమార్, భూపాల్ రెడ్డి, మాజీ జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఉస్మాన్, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, మాజీ సర్పంచులు సురేశ్, స్వామి, సదానందం, కొంరయ్య, మాజీ ఎంపీటీసీ రాజు, మాజీ జిల్లా అత్మకమిటీ డైరెక్టర్లు దేవేందర్, రాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కుమార్, నాయకులు అశోక్, రఘువంశీ, రాజు, చంద్, లక్ష్మణ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.