Veyi stambala gudi | హనుమకొండ చౌరస్తా, మార్చి 1: చారిత్రక వేయిస్తంభాల గుడి ప్రాంగణంలో కేరళ, తెలంగాణ జానపద కళా సాంస్కృతిక ఉత్సవం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల, కూరపాటి హాస్పటల్ చైర్మన్ డాక్టర్ కూరపాటి రమేష్ తెలిపారు.
ఇవాళ హనుమకొండలోని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ..
వరంగల్ నెహ్రూ యువ కేంద్ర, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యతను పెంపొందించడం కోసం, భిన్నత్వంలో ఏకత్వం సాధించడమే లక్ష్యంగా.. ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా కేరళ రాష్ట్రం నుండి 27 మంది యువతి, యువకులు వరంగల్ కురావడం జరిగింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 3 వరకు జరగనున్న ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా నేడు కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 F లయన్ కుందూరు రఘోత్తంరెడ్డి, హనుమకొండకు చెందిన అభయ హాస్పిటల్స్, కూరపాటి హాస్పిటల్స్, ముక్తి లేజర్ ఫైల్స్ క్లినిక్ ఈ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ అందిస్తున్నారు. హనుమకొండ వరంగల్ నగరాలకు చెందిన ప్రాంతాల ప్రజలు కేరళ జానపద నృత్య ప్రదర్శనను తిలకించడానికి అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్ ఆకులపల్లి మధు పాల్గొన్నారు.
Nidamanur | కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పదిమంది మహిళలకు గాయాలు