Clay Durgamatha Idol | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 24 : పర్యావరణానికి మేలు చేసే మట్టి విగ్రహాల ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వినాయక చవితి సందర్భంగా ఏటా మట్టి గణేశులను ఏర్పాటు చేసుకోవాలని ప్రత్యేకంగా క్యాంపెయిన్లను కూడా నిర్వహిస్తుండటం కనిపిస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు దసరాను పురస్కరించుకొని రాష్ట్రమంతటా దుర్గామాత కొలువు దీరగా.. దేవీ నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని తెలిసిందే. కాగా మట్టి దుర్గామాత విగ్రహాల విశిష్ఠతను అందరికీ తెలియజేసేలా నిర్ణయం తీసుకుని ఎంతో మంది స్పూర్తిగా నిలుస్తున్నారు ముగ్గురు స్నేహితులు.
హనుమకొండ రెడ్డి కాలనీలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ దుర్గామాత సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 51 అడుగుల దుర్గామాతను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. భక్తులంతా భారీ ఎత్తున తరలివచ్చి దుర్గామాతకు పూజలు నిర్వహిస్తున్నారు. హనుమకొండ జిల్లా రెడ్డికాలనీలో మొదటిసారిగా మట్టితో ముగ్గురు స్నేహితులు కలిసి అతిపెద్ద దుర్గామాత విగ్రహాన్ని నెలకొల్పారు.
రెడ్డి కాలనీలో 16వ దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్రంలోనే అతిపెద్ద విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గామాత విగ్రహాన్ని ఒడిశా కార్మికులు నెలరోజుల పాటు శ్రమించి సుమారు రూ.35 లక్షలు వ్యయంతో రూపొందించినట్లు రెడ్డి కాలనీ ఫ్రెండ్స్‌యూత్ అసోసియేషన్ దుర్గామాత సెంటర్ ప్రెసిడెంట్ సిరులంచ శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ వేల్పుల నరేష్, అకౌంటెంట్ ఎండి అన్వర్‌ఖాన్ తెలిపారు.
అమ్మవారికి ప్రతి రోజు ప్రజలు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి భారీ విగ్రహం వద్ద ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. అక్టోబర్ 3న 2 క్వింటాళ్ల కుంకుమ, పసుపు, ఒకటి పాల ట్యాంకర్‌తో అభిషేకం నిర్వహించి, రెండు ఫైరింజన్ల సహాయంతో వాటర్‌తో అక్కడే నిమజ్జనం చేయనున్నట్లు ప్రెసిడెంట్ శ్రీకాంత్ తెలిపారు. అమ్మవారి మట్టిని కాలనీ ప్రజలకు అందజేస్తామని, ప్రతిరోజు క్వింటాల్ ప్రసాదాన్ని ప్రజలకు పంచుతున్నట్లు శ్రీకాంత్ తెలిపారు.
BC Reservations | బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే : ఎమ్మెల్సీ మధుసూదనాచారి
Group-1 | గ్రూప్-1పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే
Supreme Court | అస్తిత్వ సంక్షోభంలో హిమాలయన్ రాష్ట్రాలు.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు