Group-1 | హైదరాబాద్ : గ్రూప్-1 మెయి న్స్ పరీక్ష పేపర్లను తిరిగి మూల్యాంక నం చేయాలని లేనిపక్షంలో తిరిగి పరీక్షలను నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. విచారణను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు డివిజన్ బెంచ్.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో 719 మంది అభ్యర్థులు ఒకే రకమైన మారులు సాధించడం, అభ్యర్థుల సంఖ్యలో వ్యత్యాసంపై టీజీపీఎస్సీ ఇచ్చిన వివరణను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని, కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 14.8% మంది టాప్-500 మందిలో ఉన్నారనేందుకు ఆధారాలు లేవని పిటిషన్లో పేర్కొన్నారు. భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన పరమేశ్ మట్టా, మరో 221 మంది అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చిన ఈ పిటిషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.