Gymnastic Competitions | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 2 : తెలంగాణ రాష్ర్టస్థాయి జిమ్నాస్టిక్స్, జూడో పోటీలు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ పోటీల్లో సుమారు 500 మంది క్రీడాకారులు, టెక్నికల్ అఫిషీయల్స్పాల్గొన్నారు. రెండోరోజు జేఎన్‌ఎస్‌లోని జిమ్నాస్టిక్ హాల్, బాక్సింగ్ హాల్లో పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ ఆర్గనైజ్ సెక్రెటరీ వి ప్రశాంత్‌కుమార్, హనుమకొండ జిల్లా యువజన క్రీడల అధికారి గుగులోతు అశోక్‌కుమార్ నాయక్, భూపాలపల్లి డీవైఎస్వో సిహెచ్ రఘు, తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.పార్థసారథి, టిజిపేట రాష్ర్ట అసోసియేట్ ప్రెసిడెంట్ భోగి సుధాకర్, టోర్నమెంట్ అబ్జర్వర్లు స్వామిరాజ్, సత్యనారాయణ, జిమ్నాస్టిక్స్ కన్వీనర్ సీహెచ్ పెద్దిరాజు, జూడో కన్వీనర్ ఎం.సురేష్‌బాబు, కో-కన్వీనర్లు నిశాంత్, శ్రీలత, పీడీలు శ్రీధర్, ఆర్.సుభాష్‌కుమార్, సిహెచ్.వెంకటేశ్వర్లు, జి.రవీంద్రప్రసాద్, నీలం సురేష్ పాల్గొన్నారు.

KTR | ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోతారు.. జూబ్లీహిల్స్ ఓటర్లకు కేటీఆర్ సూచన
ISRO | నిప్పులు చిమ్ముతూ.. నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో బాహుబలి రాకెట్..!
Khawaja Asif | మమ్ములను ఘర్షణలతో బిజీగా ఉంచాలన్నదే భారత్ వ్యూహం.. మరోసారి పాక్ ప్రేలాపన