Medical Service | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 25 : ప్రపంచ పైల్స్దినోత్సవం సందర్భంగా హనుమకొండ చౌరస్తాలోని ముక్తి లేజర్ పైల్స్ క్లినిక్ ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్య అవగాహన కోసం ఈ నెల 30 వరకు ప్రజలకు ఉచిత ఓపీ సేవలు అందించనున్నట్లు డాక్టర్ కూరపాటి రమేశ్, సీనియర్ ప్రాక్టాలజిస్ట్ డాక్టర్ సుధాకర్ కల్పగిరి తెలిపారు. మంగళవారం ఈ మేరకు వారు క్లినిక్‌లో అవగాహన పోస్టర్లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు పైల్స్ వచ్చే కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు, ఆధునిక లేసర్ చికిత్సల లాభాలు వంటి అంశాలపై 29న పైల్స్‌పై అవగాహన సదస్సును క్లినిక్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా మరింత మంది ప్రజలకు పైల్స్ పై సరైన సమాచారం తెలుసుకొని సమయానికి చికిత్స పొందగలరని వారు ఆశించారు. వరంగల్ ప్రజలు ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
Harish Rao | నీకు మహిళలు ఎందుకు ఓటెయ్యాలి.. సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు
Palash Muchhal | మళ్లీ ఆసుపత్రిలో చేరిన స్మృతి మంధానకు కాబోయే భర్త