జయశంకర్ భూపాలపల్లి : ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా జయశంకర్ జిల్లా కాటారం మండలంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి గుమ్మల్లపల్లి గ్రామానికి చెందిన రైతులు నిరసన తెలిపారు. నెల రోజులు గడుస్తున్నా కాంటాలు పెట్టక, లారీలు రాక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్: శ్రీనివాస్ వచ్చి రైతులతో మాట్లాడిన వినలేదు. కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ పీఏతో మాట్లాడి లారీలు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గంటకు పైగా సాగిన ఆందోళనతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.