Creative Skills | హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 18 : విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు హనుమకొండ జిల్లా విద్యావైజ్ఞానిక ప్రదర్శన నేటి నుంచి రెండు రోజులపాటు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి లింగాల వెంకటగిరిరాజ్ గౌడ్ తెలిపారు. గురువారం హనుమకొండలోని సెయింట్ పీటర్స్ ఎడ్యూసెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
ఈ సారి ప్రదర్శన సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, ఆరోగ్యం, వ్యవసాయం ఇతర అభివృద్ధి ఇతివృత్తాలపై దృష్టిసారిస్తుందని వివరించారు. ప్రాజెక్టులు, వాస్తవికత శాస్త్రీయ విధానం ప్రదర్శన నైపుణ్యాల ఆధారంగా మూల్యాంకనం చేస్తారని తెలిపారు. ఇన్స్పైర్ కోసం 70, విద్యావైజ్ఞానిక ప్రదర్శనకు 170 మంది ఇప్పటికే పేరు నమోదు చేసుకున్నారని చెప్పారు. రెండు రోజుల్లో నాలుగు సెషన్లుగా మూడేసి మండలాల విద్యార్థులు పాల్గొంటారని, బాలమేధావులను ప్రోత్సహించేందుకు కార్యక్రమానికి చేయూతనిచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కో-కన్వీనర్ పి.శ్రీనివాసస్వామి, ఎంఈవోలు నెహ్రూనాయక్, మనోజ్‌కుమార్, సీఎంవో బద్దం సుదర్శన్‌రెడ్డి, జిల్లా సార్వత్రికవిద్యా సమన్వయకులు అనగోని సదానందంగౌడ్, సెయింట్ పీటర్స్ విద్యాసంస్థల అధినేత నర్రా నారాయణరెడ్డి, ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంఘం ప్రతినిధులు వెలగందుల ముక్తేశ్వర్, మాదాల సతీష, శ్రీకాంత్‌రెడ్డి, రాజేష్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


Aadarsha Kutumbam | వెంకటేష్–త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్లో మార్పు?
Bigg Boss 9 | టైటిల్ రేస్‌లో ట్విస్ట్.. విన్నర్ ఎవరు? అందరిలో పెరిగిన ఉత్కంఠ
Spirit | ప్రభాస్‌కి న్యూ ఇయర్ బ్రేక్ రద్దు.. టైట్ షెడ్యూల్ ఫిక్స్ చేసిన సందీప్ వంగా..