పరకాల: హనుమకొండ జిల్లా పరకాల (Parakala) మండల ప్రత్యేక అధికారిగా డాక్టర్ కే. విజయభాస్కర్ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ భాధ్యతలు నిర్వహించిన కే. వెంకటనారాయణ జాయింట్ డైరక్టర్ పదోన్నతిపై ఖమ్మం జిల్లాకు వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో జిల్లా పశు వైద్యాధికారిగా భాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ విజయ భాస్కర్‌ను మండల ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. సాధ్యమైనంత వరకు వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు, పర్యవేక్షకులు సీహెచ్ శైలశ్రీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా పరిషత్, మండల పరిషత్ అధ్యక్షుల పదవీకాలం గతేడాది జూలైలోని ముగిసింది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకపోవడంతో మండల పరిషత్‌లు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లిన విషయం తెలిసిందే.